జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి తొలిసారి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తున్న విషయం తెలుసుకున్న చిరంజీవి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
అన్నయ్య ఇంట్లో కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి తొలిసారి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తున్న విషయం తెలుసుకున్న చిరంజీవి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చి మరి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను ఇంటిలోకి తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవికి సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకున్నాడు. భార్య అన్న లెజ్ఞోవా, కుమారుడు అకిరా నందన్ తో కలిసి పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు వదిన సురేఖ హారతి ఇచ్చి ఆహ్వానించింది. అనంతరం భావోద్వేగంతో తల్లిని పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా ఆలింగణం చేసుకున్నారు. ఆ తర్వాత తల్లి అంజనమ్మ, వదిన సురేఖ కాళ్లకు కూడా నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ విజయం కోసం కుటుంబ సభ్యులంతా తమ ప్రయత్నాలను సాగించారు. నేరుగా పిఠాపురం వెళ్లి పలువురు కుటుంబ సభ్యులు ప్రచారం చేయగా, చిరంజీవి ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి మరి తమ్ముడిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన నుంచి పోటీ చేసిన 21 మంది అభ్యర్థులు అద్భుత విజయాన్ని నమోదు చేశారు.