రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించింది. ఆయా నిర్మాణాలు నిబంధనకు విరుద్ధంగా, అడ్డగోలుగా నిర్మించారంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోంది.
టిడిపి, వైసిపి పార్టీ ఆఫీసులు
రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించింది. ఆయా నిర్మాణాలు నిబంధనకు విరుద్ధంగా, అడ్డగోలుగా నిర్మించారంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని కూల్చివేస్తామంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయగా.. మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. విశాఖతోపాటు అనేక జిల్లాల్లో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలకు నోటీసులను కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైసిపి నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. పార్టీ కార్యాలయాలను పేలస్లు మాదిరిగా జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. ఇంకెన్ని పేలస్లు కావాలి జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ధీటుగా జవాబు ఇస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలతో కూడిన ఫోటోలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు జత చేసి తమవి పెలస్లు అయితే మీ ఊరి గుడిసెలా అంటూ తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి భూ కేటాయింపులకు సంబంధించిన జీవోలను కూడా సామాజిక మాధ్యమాల్లో వైసిపి సోషల్ మీడియా టీమ్ సర్కులేట్ చేస్తోంది. దీనిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఇరు పార్టీలు ప్రభుత్వ భూములను అప్పనంగా కొట్టేసాయంటూ ప్రజలు పేర్కొంటున్నారు. ఈ వార్ ఎప్పటి వరకు నడుస్తుందో చూడాల్సి ఉంది.