||గోడ ప్రతులు ఆవిష్కరిస్తున్న మిట్టపెల్లి సుదర్శన్, పద్మశాలీయులు||
ఈవార్తలు, జగిత్యాల: రాజకీయాల్లో పద్మశాలీల పాత్ర మరింత పెరిగే దిశగా ఆ కులస్థులు ముందగుడు వేస్తున్నారు. ఈ నెల 13న జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించ తలపెట్టిన రాజ్యాధికార సాధన కోసం చలో కోరుట్ల అంటున్నారు. పద్మశాలి రాజకీయ యుద్ధభేరి పేరిట పద్మశాలీయులందరినీ ఏకం చేసే దిశగా ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జిల్లాలోని మల్యాల మండలం పద్మశాలి సంఘం నాయకులు గోడ ప్రతులను ఆవిష్కరించారు.
మండల కేంద్రంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో మల్యాల మండల పద్మశాలి అధ్యక్షుడు ముల్క మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన గోడ ప్రతుల ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా మల్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మిట్టపల్లి సుదర్శన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు కస్తూరి విశ్వనాథం, కోశాధికారి బొమ్మకంటి గంగాధర్, ప్రధాన సలహాదారు కొండబత్తిని గంగాధర్, సహాయ కార్యదర్శి వీరబత్తిని గంగాధర్, బుదారపు గంగమల్లు, సలహాదారు బొద్దుల మహేందర్, కార్యవర్గ సభ్యులు కొండబత్తిని నర్సయ్య, పెంట సురేష్, అల్లె శంకర్, భూర్ల గణేశ్, అడ్లగట్ట లింగయ్య, మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.