రాష్ట్రంలో కోటి టన్నుల ఇసుక అందుబాటులో ఉంచాం : రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకను అందించేందుకు సిద్ధమవుతోంది. ఉచిత ఇసుక పంపిణీపై మంత్రి కూడా తాజాగా ప్రకటన చేశారు. రెండు, మూడు నెలల వ్యవధిలో ప్రజా అవసరాలకు దాదాపు కోటి టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు.

minister Kollu Ravindra

 మంత్రి కొల్లు రవీంద్ర 

రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకను అందించేందుకు సిద్ధమవుతోంది. ఉచిత ఇసుక పంపిణీపై మంత్రి కూడా తాజాగా ప్రకటన చేశారు.  రెండు, మూడు నెలల వ్యవధిలో ప్రజా అవసరాలకు దాదాపు కోటి టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ అంశంపై అధికారులకు ఇప్పటికే దిశా, నిర్దేశం చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు ఏ రీచ్ లో ఇసుక కావాలనుకుంటే అక్కడ నుంచే కేవలం సీనరేజ్, లోడింగ్ చార్జీలు చెల్లించి రవాణా చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నేరుగా రీచ్లకు వెళ్లి తెచ్చుకోవచ్చని వివరించారు. ఇసుక రూపేనా ప్రభుత్వం ఒక్క పైసా కూడా వసూలు చేయడం లేదని వెల్లడించారు.

ప్రస్తుతం 120 స్టాక్ పాయింట్లలో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని వెల్లడించారు. అవసరం మేరకు నదుల్లో సిల్ట్ ను కూడా ఉపయోగించుకునే వెసులుబాటు ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలకు అనుగుణంగా నిల్వ ఉన్న ఇసుకను రెండు, మూడు రోజుల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన ఫైల్ హార్డ్ డిస్క్ లు దహనం చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంలో అధికారులు, పాలకులు తప్పిదాలు ఉన్నట్లు గుర్తించామని, దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇసుకను అందించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇసుక విధానంలో అక్రమాలకు పాల్పడిందని, కోట్లాది రూపాయలు దోచుకుందని ఆరోపించారు. ఇసుకను పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి ఉంచేందుకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజలకు ఇసుకను పెద్ద ఎత్తున అందుబాటులోకి ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. ఇసుక అవసరమైన ప్రతి ఒక్కరూ నూతన విధానం ద్వారా తీసుకువస్తున్న ఇసుకను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్