లోక్ సభ స్పీకర్గా ఓం బిర్లా.. ఓటింగ్ లేకుండానే ప్రకటించిన ప్రోటెం స్పీకర్

లోక్ సభ స్పీకర్ గా రెండోసారి బిజెపి ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో ఆయన ఎన్నిక అయినట్టు ప్రోటెం స్పీకర్ ప్రకటించారు. బుధవారం లోక్ సభ సమావేశమైన వెంటనే మిగిలిన సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రోటెం స్పీకర్.. స్పీకర్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారు.

 Modi and Rahul congratulate Speaker Om Birla

స్పీకర్ ఓం బిర్లాకు మోడీ, రాహుల్ అభినందనలు 

లోక్ సభ స్పీకర్ గా రెండోసారి బిజెపి ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో ఆయన ఎన్నిక అయినట్టు ప్రోటెం స్పీకర్ ప్రకటించారు. బుధవారం లోక్ సభ సమావేశమైన వెంటనే మిగిలిన సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రోటెం స్పీకర్.. స్పీకర్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారు. దీనిపై అధికార, ప్రతిపక్షాల సభ్యులు ఆమోదం తెలపడం, తిరస్కరించడం చేశారు. స్పీకర్ పదవికి 48 ఏళ్ల తర్వాత ఎన్నిక తొలిసారి జరిగింది. సభాపతి పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. బుధవారం లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. సభాపతిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్ తోపాటు పలువు ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. ఇండియా కూటమి అభ్యర్థిగా కె సురేష్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు.

దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపరిచారు. అనంతరం మూజువాణి ఓటింగ్ విధానాన్ని చేపట్టారు. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెంట రాగా ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆశీనులయ్యారు. ఆయనకు మోడీ, రాహుల్ సహా లోక్ సభ సభ్యులు అభినందనలు తెలియజేశారు. స్పీకర్ పదవిని వరుసుగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు. 61 ఏళ్ల ఓం బిర్లా రాజస్థాన్ లోని  కోట నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్సభలో 86% హాజరు నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలు అడిగారు. 2019లో గెలిచాక తొలిసారి స్పీకర్ గా ఎన్నికయ్యారు. మళ్లీ తాజాగా రెండోసారి స్పీకర్ గా ఎన్నికయ్యారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్