మంత్రి పదవి రాకపోవడంపై బాధ లేదు : టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే చంద్రబాబు ఏర్పాటు చేసిన మంత్రివర్గంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి.

Former minister Ayyannapatrudu

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే చంద్రబాబు ఏర్పాటు చేసిన మంత్రివర్గంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. సీనియర్ నేతలకు అవకాశాలను ఇవ్వలేదన్న అసంతృప్తి అనేకమంది నేతల్లో కూడా ఉంది. తాజాగా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. మంత్రి పదవి రాకపోవడం పట్ల తనకు బాధ లేదని, ఎన్టీఆర్ మంత్రివర్గంలో తనకు 25 ఏళ్లకే మంత్రి పదవి లభించిందన్నారు. అప్పుడు కూడా ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారని, అయినా తనకు అవకాశం దొరికిందని ఇప్పుడు కూడా అలాగే యువతకు అవకాశాలు లభించాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము కష్టపడి పనిచేసే అధికారాన్ని దక్కించుకున్నామని వెల్లడించారు. జూనియర్లకు అవకాశాలు దక్కాలని, వారిని ప్రోత్సహించి అండదండగా ఉంటామన్నారు. తమలాంటి సీనియర్లకు ఎమ్మెల్యే టికెట్లు దక్కడమే గొప్ప అని, దీనికి ఓదార్పు ఎందుకన్నారు. ఆస్తుల పుస్తకాలపై సైకో ఫోటోలు ఉన్నాయని వాటిని తొలగించాలని సూచించామన్నారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై తనకు ఎటువంటి బాధ లేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించే దిశగా, అభివృద్ధిలో పరుగులు పెట్టించేలా చంద్రబాబు పరిపాలన ఉండబోతుందని అయ్యన్న పాత్రుడు జోస్యం చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వ ముందుకు సాగుతోందన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్