||కల్వకుంట్ల కవిత Photo: Twitter||
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు స్టే పై నిరాశే మిగిలింది. ఈడీ పంపిన నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత కోరారు. ఈనెల 11న ఈడీ అధికారులు 9 గంటలపాటు విచారణ చేశారు. ఈడీ విచారణ ఇతరులతో కలిపి విచారిస్తామన్నారు. కానీ, తమ ఒకరినే ఈడీ విచారణ చేశారని, అలాగే ఒక మహిళను విచారణ చేయాలంటే తమ ఇంటి వద్దనే చేయాలి. సీఆర్‌పీసీ 160 సెక్షన్ ప్రకారం ఈడి విచారణ చేయాలంటే మహిళను ఇంట్లోనే విచారించాలని కార్యాలయానికి పిలిపించడం తప్పని సుప్రీంకోర్టుకు స్టే పంపారు. ఈనెల 16న మళ్లీ విచారణ హాజరుకావాలని నోటీస్ పై ఆమె నిరాకరిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందుకు సుప్రీంకోర్టు మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని తెలిపింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత మార్చి 16న మరోసారి ఈడీ విచారణలో హాజరుకానున్నారు.