తెలంగాణ అసెంబ్లీలో దాదాపు సగం మంది రెడ్డి సామాజిక వర్గం వారే.. మొత్తం ఎంత మంది అంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||రేవంత్ రెడ్డి Photo: Twitter||

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. సోమవారం సీఎల్పీ సమావేశానంతరం ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో దాదాపు 40 మంది రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే ఉండడం గమనార్హం. వారిలో అనుముల రేవంత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మేఘా రెడ్డి, చామకూర మల్లా రెడ్డి, పర్ణికా రెడ్డి, ధొంతి మాధవరెడ్డి, కుంబం అనిల్ కుమార్ రెడ్డి, తమ్మన్నగారి రామ్ మోహన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, బండారి లక్ష్మా రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బత్తుల లక్ష్మా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుధీర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, రేకులపల్లి భూపతిరెడ్డి, పాటిల్ల సంజీవ రెడ్డి, నలమాడ పద్మావతి రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్