ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకుంటూ ఎన్టీయే కూటమి నిర్ణయం తీసుకుంది. శుక్రవారం న్యూఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్డీయే పక్ష నేతలు హాజరయ్యారు.
నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, ఈవార్తలు : ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకుంటూ ఎన్టీయే కూటమి నిర్ణయం తీసుకుంది. శుక్రవారం న్యూఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్డీయే పక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలంతా ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ.. రాజ్యాంగానికి ప్రమాణం చేశారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బీహార్ సీఎం నితీశ్ కుమార్, పవన్ కల్యాణ్, కుమారస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీ పేరును ప్రతిపాదించగా, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేడీఎస్ నేత కుమారస్వామి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తదితరులు బలపరిచారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా దేశానికి ప్రధాని మోదీ గొప్ప పేరు తీసుకొచ్చారని తెలిపారు. మోదీ విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థకు మోదీ నేతృత్వం వహిస్తున్నారని వెల్లడించారు. ఈ సమావేశానంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎన్డీయే తరఫున ప్రతినిధులు రాష్ట్రపతికి లేఖను అందించనున్నారు.