నేడు ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం

దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఢిల్లీలో అసాధారణ రీత్రలో ఏర్పాటుకు సాగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి వేదిక అయినా రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్ల సంచారాన్ని పూర్తిగా నిషేధించారు.

PM Narendra Modi

ప్రధానిగా నరేంద్ర మోడీ

దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఢిల్లీలో అసాధారణ రీత్రలో ఏర్పాటుకు సాగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి వేదిక అయినా రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్ల సంచారాన్ని పూర్తిగా నిషేధించారు. ఢిల్లీ ఇప్పటికే భద్రత వలయంలోకి వెళ్లిపోయింది. నేషనల్ సెక్యూరిటీ గార్డులు, షార్ప్ షూటర్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాణ స్వీకారం మహోత్సవానికి దక్షిణాసియా దేశాల అధినేతలు వస్తుండడం, అధికార ఎన్డీఏ పార్టీల అధినాయకులందరికీ ఆహ్వానాలు వెళ్లడంతో ఢిల్లీలో హై అలెర్ట్ ప్రకటించారు. ప్రపంచ దేశాల అధినేతలు గతేడాది పాల్గొన్న జీ20 సదస్సుకు కల్పించిన భద్రతను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచాధినేతలు బస చేసిన హోటల్ దగ్గర, పాల్గొనాల్సిన సదస్సు ప్రాంగణం పరిసర ప్రాంతాలను ఇప్పటికే అణువణువు ప్రత్యేక బృందాలు జల్లెడ పట్టాయి. చిన్న పొరపాటుకు తావు ఇవ్వకుండా డేగ కళ్ళ పహారా కొనసాగిస్తున్నాయి. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులు హాజరవుతున్నారు. ఈ జాబితాలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే, మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫిఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జగన్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని తబ్గే హాజరుకానున్నారు. భారత్ అనుసరిస్తున్న పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం సాగర్ విజన్ లో భాగంగానే వీరిని ఆహ్వానించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 2014లో ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో రెండోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిమ్స్ టెక్ దేశాల అధినేతలు హాజరయ్యారు. తాజాగా ప్రమాణస్వీకారం కార్యక్రమానికి పొరుగు దేశాల అధినేతలకు ఆహ్వానం అందింది. అలాగే, దేశంలోని కొందరికీ ఆహ్వానాలు అందాయి. మహారాష్ట్రలో వందే భారత్ రైలు లోకో పైలట్ సురేఖ యాదవ్ తోపాటు మరో తొమ్మిది మంది లోకో పైలట్లకు ఆహ్వానం అందడం విశేషం. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. రెడ్ కార్పెట్ తో ఈ కార్యక్రమానికి చేసిన ఏర్పాట్ల చిత్రాలను రాష్ట్రపతి భవన్ ఇప్పటికే విడుదల చేసింది. 

ప్రధానితో సహా మంత్రుల ప్రమాణ స్వీకారం..

ప్రధానితోపాటు మరి కొంతమంది కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం రాత్రి 7:15 గంటలకు మోడీతోపాటు 30 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్ల జాబితాను ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్ కు పంపించారు. ఆయా నేతలకు ప్రధాన మంత్రి కార్యాలయం సమాచారం అందిస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు పూర్తిగా సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిన మోడీ తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించాల్సి రావడం వల్ల మంత్రి వర్గ కూర్పులో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్