Yuvagalam | ప్రకాశం బ్యారేజీపై ఇసుకేస్తే రాలనంత జనం.. కృష్ణా జిల్లాలోకి నారా లోకేశ్ ఎంట్రీ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రకాశం బ్యారేజీపై భారీగా టీడీపీ నేతలు, ప్రజలు||

ఈవార్తలు, విజయవాడ: ఏం జనం.. ఏ జనం.. ప్రకాశం బ్యారేజీ నిండా పసుపు వనం.. ఇసుకేస్తే రాలనంత జనం.. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ కండువాలే. యువగళం పాదయాత్రతో టీడీపీ నేత నారా లోకేశ్ దూసుకుపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దిగ్విజయంగా సాగిన యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్దమొత్తంలో ప్రకాశం బ్యారేజీపైకి తరలివచ్చారు. పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు నారా లోకేశ్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. అటు.. ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు పసుపు, ఎరుపు రంగు బెలూన్లతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

ఈ నేపథ్యంలో భారీగా తరలివచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు జనసంద్రంగా మారాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర మొత్తం కిక్కిరిసిపోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యకర్తలు బాణాసంచా పేల్చి, జై తెలుగుదేశం.. జై ఎన్టీఆర్.. జై చంద్రబాబు.. జై లోకేశ్.. అంటూ నినదించారు. అభిమానులు తమ యువనేతకు భారీ గజమాల వేసి, పూల వర్షం కురిపించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్