ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న వైఖరిని దేశవ్యాప్తంగా చాటి చెప్పే ఉద్దేశంతో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ధర్నా వేదిక వద్ద అఖిలేష్ యాదవ్ తో జగన్
ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న వైఖరిని దేశవ్యాప్తంగా చాటి చెప్పే ఉద్దేశంతో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేతలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ, దళిత నేత రెడ్డప్ప ఇంటిపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. రెడ్డప్ప ఇంటిపై దాడి చేసి కార్లను ధ్వంసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్స్ హోల్డింగ్స్ పెట్టారని, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. కానీ, టీడీపీ ఏకంగా తమ పార్టీ ఎంపీ, మాజీ ఎంపీపైనే దాడి చేశారని, దాడులు టిడిపి నాయకులు చేసి చేసి తిరిగి బాధితులపై కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతోపాటు చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తిగా కూడా విఘాతం కలుగుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు రావాల్సి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వేయికిపైగా ఆక్రమ కేసుల్లో కార్యకర్తలను జైల్లో పెట్టారన్నారు. వందల ఇళ్లను ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.
జాతీయ నేతలు సంఘీభావం
జగన్మోహన్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాకు పలు పార్టీలకు చెందిన జాతీయ నేతలు సంఘీభావాన్ని తెలిపారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నదీముల్ హక్, ఉద్ధవ్ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్, అన్నా డీఎంకే ఎంపీ తంబి దొరై, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తదితరులు తమ సంఘీభావాన్ని తెలిపారు. అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ కూడా జగన్ ధర్నాకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారంతా ధర్నాలో పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలు, ఫోటోల ప్రదర్శనను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్రం ఈ వ్యవహారం పై జోక్యం చేసుకోవాలన్నారు.