ప్రజల హృదయాల్లో మోదీకి ఉన్న చోటుకు ఈ ఎన్నికలు నిదర్శనం: యర్రం వెంకటరెడ్డి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||యర్రం వెంకటరెడ్డి||

(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

ప్రజల హృదయాలలో ప్రధాని నరేంద్ర మోదీది ప్రత్యేక స్థానమని నమో మంత్ర ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి యర్రం వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బుజ్జగింపులకు, కుల రాజకీయాలకు కాలం చెల్లిందని ఈ ఎన్నికలు రుజువు చేశాయి అని తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ప్రజలు ఆచరణాత్మక రాజకీయాలకు ఓటేసి, మోదీకి తిరుగులేని మద్దతు ఇచ్చారని వెల్లడించారు. ఈ మూడు రాష్ట్రాల్లో కమల వికాసం, మోదీ హవా మరోసారి కనిపించిందని, అమిత్ షా కూడా ప్రచారంలో కీలక పాత్ర పోషించారని వివరించారు. మరో నాలుగు, ఐదు నెలలలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎగిరేది కాషాయ పతాకమేనని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని కాంగ్రెస్ సైద్ధాంతిక అస్త్రాలు ఎదురుకోలేకపోయాయని, రాహుల్ ప్రియాంక కలిసినా మోడీ జనాకర్షణ ముందు నిలువలేకపోతున్నారని తేల్చి చెప్పారు. మూడు రాష్ట్రాలలో బీజేపీ విజయం దేశవ్యాప్తంగా కార్యకర్తలలో కొత్త ఊపు ఇచ్చిందని అన్నారు. వచ్చే నెల 22న అయోధ్యలో భవ్యమైన అయోధ్య రామమందిరాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించాస్తారని, దీనితో భారతీయ జనతా పార్టీకి కొత్త శక్తి లభిస్తుందని వెల్లడించారు

2018 ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గ్రామీణ, పట్టణ దళిత, ఆదివాసీ ఓట్లను బీజేపీ కోల్పోయిందని, 20 23 నాటికి ఆ కుటుంబాల ఆదరణ పొందిందని వెంకటరెడ్డి తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 49 శాతం, ఛత్తీస్ గఢ్‌లో 46%, రాజస్థాన్లో 42% ఓట్లను పొందగలిగిందని వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ లెక్కలు కీలకము కాబోతున్నాయని అన్నారు. ఈ ఘనత భారతీయ జనతా పార్టీది, ప్రధాని నరేంద్ర మోదీదే అని అన్నారు. బీజేపీ హిందుత్వ ఎజెండాకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయోగించిన కులగణన కార్డు పనిచేయలేదని, ఓబీసీలను ఆకట్టుకునేందుకు దేశవ్యాప్తంగా కుల గణన చేయిస్తామన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీలను ప్రజలు నమ్మలేదని తేల్చి చెప్పారు. 

తెలంగాణలో ఓటు బ్యాంకు పెరిగింది

తెలంగాణ విషయానికి వస్తే గతంలో కంటే భారతీయ జనతా పార్టీ బాగా ఓట్లు పొందిందని తెలిపారు. సీట్లలో సింగిల్ డిజిట్ కే పరిమితం అయినప్పటికీ గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతోపాటు ఓటు బ్యాంకు పెంచుకున్నామని వివరించారు. 2014లో ఐదు సీట్లు, 2018లో ఒకే ఒక్క సీటుకు పరిమితమై.. ఈసారి ఏకంగా ఎనిమిది సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. కామారెడ్డి అభ్యర్థి వెంకటరమణారెడ్డి ప్రత్యేకత చాటుకున్నారని కామారెడ్డి నియోజకవర్గం నుండి సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఓడించి విజయం సాధించారని వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్