అచ్చన్నకు ఘాటుగా రిప్లై ఇచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి.. జన్మకు కోరిక నెరవేరదంటూ వ్యాఖ్య.?

ఏపీలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఉండే వాతావరణం ప్రస్తుతం ఏపీలో కనిపిస్తోంది. గడచిన కొద్ది రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదంపై వివాదం నడుస్తుండగా.. తాజాగా వైసిపి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంగా మరో కీలక వివాదం ఆజ్యం పోసుకుంది. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా టిడిపిలోకి వచ్చేందుకు ప్రయత్నించారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.

Vijayasai Reddy, Minister Achchennaidu

విజయసాయిరెడ్డి,  మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఉండే వాతావరణం ప్రస్తుతం ఏపీలో కనిపిస్తోంది. గడచిన కొద్ది రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదంపై వివాదం నడుస్తుండగా.. తాజాగా వైసిపి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంగా మరో కీలక వివాదం ఆజ్యం పోసుకుంది. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా టిడిపిలోకి వచ్చేందుకు ప్రయత్నించారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడం వల్లే మీ చేష్టలు, మాటలు అన్ని వింతగా ఉంటాయని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టిడిపి అనే కుల పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా అంటూ ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు.

'అచ్చం నాయుడు. దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1 శాతం మాత్రమే ఇచ్చాడేమో. చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అచ్చి, బుజ్జి, కచ్చి అని ఆట పట్టించే వారట కదా. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడం వల్లే మీ చేష్టలు, మాటలు అన్ని వింతగా ఉంటాయి. మోకాలకి బోడిగుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను టిడిపి అనే కుల పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా.?' అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 'అచ్చన్న నువ్వు ఎంత గట్టిగా అనుకున్న ఈ జన్మకు నీ కోరిక తీరదయ్య. భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే  గో.. ఆన్.. నిన్ను ఆపేదెవరు. జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేధో శక్తికి, అడ్డం నిలువకు మధ్య ఉండే తేడా తెలియకపోవడం వల్లే మీతో ఈ సమస్య అంతా' అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైరల్ గా మారింది. వైసీపీ శ్రేణులు ఈ ట్వీట్ ను పెద్ద ఎత్తున షేర్ చేస్తుండగా. టిడిపి క్యాడర్ మాత్రం విజయసాయిరెడ్డి వీటికి ఘాటుగానే సమాధానాలు ఇస్తున్నారు. ఈ ట్విట్ పై మంత్రి అచ్చెన్నాయుడు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్