||కేసీఆర్‌తో సంతోష్ కుమార్ (పాత ఫొటో)||
కొండగట్టు అడవిని దత్తత తీసుకుంటున్నట్టు ఎంపీ సంతోష్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 17 ఫిబ్రవరి 69వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మూలకారకుడైన ముఖ్యమంత్రి కోసం ఎంపీ సంతోష్ కుమార్ 1094 ఎకరాల అడవిని దత్తత తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీరాముడు నమ్మిన బంటు స్వయంభు గా వెలసిన కొండగట్టు ఆంజనేయస్వామి అభయారణ్యాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గా కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని కంపార్టెమెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని ఎంపిక చేసుకొని 500 ఏళ్ళ సంవత్సరాల ముందు సుగంధ భరితమైన చెట్లు, పూలు తో ఆంజనేయస్వామి ఆలయం దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా రూ. 600 కోట్లతో పునః నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ తెలిపారు. కొండగట్టు ఆలయాన్ని ఆనుకొని ఉన్న అడవి ప్రాంతాన్ని దత్తత తీసుకోని, ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు నాతనున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.