బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్.. ప్రకటించిన అధ్యక్షుడు సహబుద్దీన్

బంగ్లాదేశ్ లో గడిచిన కొద్ది రోజుల నుంచి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠత వీడింది. నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ ను తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు. తన అధికార నివాసం బంగా భవన్ లో విద్యార్థి సంఘాల నేతలు, త్రివిధ దళాధిపతులతో సుదీర్ఘంగా జరిగిన చర్చలు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధ్యక్షుడి కార్యదర్శి జోనాల్ అబేదిన్ ఒక ప్రకటన చేశారు. వివిధ పక్షాలు, రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వంలో మిగిలిన సభ్యుల పేర్లను ఖరారు చేయనున్నారు.

 Mohammad Yunus

మహమ్మద్ యూనస్

బంగ్లాదేశ్ లో గడిచిన కొద్ది రోజుల నుంచి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠత వీడింది. నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ ను తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు. తన అధికార నివాసం బంగా భవన్ లో విద్యార్థి సంఘాల నేతలు, త్రివిధ దళాధిపతులతో సుదీర్ఘంగా జరిగిన చర్చలు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధ్యక్షుడి కార్యదర్శి జోనాల్ అబేదిన్ ఒక ప్రకటన చేశారు. వివిధ పక్షాలు, రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వంలో మిగిలిన సభ్యుల పేర్లను ఖరారు చేయనున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు తమ పంతం నెగ్గించుకున్నట్టు అయింది. మరోవైపు దేశ వ్యాప్తంగా ఆందోళనకారులు ఉధృతంగా హింసకు పాల్పడ్డట్టు వెళ్లడైంది. చాలా చోట్ల హత్యలు, లూటీలు జరిగాయి. పోలీస్ స్టేషన్లకు కూడా ఆందోళనకారులు అనేక చోట్ల నిప్పు పెట్టారు. హిందువులు, అవామీ లీగ్ నేతలే లక్ష్యంగా దాడులు జరిగాయి. అనేక చోట్ల జైళ్లను బద్దలు చేయడంతో ఖైదీలు పరారయ్యారు. 

ఎవరీ మహమ్మద్ యూనస్..

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితుడైన మహమ్మద్ యూనస్ ఎవరన్న దాని పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది. యూనస్ బంగ్లాదేశ్ ఆర్థికవేత్తగా ఆ దేశ ప్రజలందరికీ సుపరచితమైన వ్యక్తి. 2006లో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న యూనస్ 1940 జూన్ 28న తూర్పు బెంగాల్లోని చిట్టా గ్యాంగ్ లో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా చిట్టా గ్యాంగ్ లోనే జరిగింది. ఆ తరువాత ఆయన పలు దేశాల వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేశారు. గ్రామీణ బ్యాంకులను స్థాపించి మైక్రో క్రెడిట్, మైక్రో ఫైనాన్స్ విధానాలను బంగ్లాదేశ్ లో పరిచయం చేశారు. ఈ అంశంపైనే ఆయనను నోబిల్ వరించింది. ఆయనను నోబెల్ కు ఎంపిక చేసినప్పుడు ఆ పురస్కార కమిటీ బ్యాంకు రుణాలకు అర్హులు కానీ పేద గ్రామీణ, ఔత్సాహక పారిశ్రామిక వేత్తలకు గ్రామీణ బ్యాంకు ఓ దిక్సూచి వంటిదని వ్యాఖ్యానించింది. ఆర్థిక రంగానికి ముఖ్యంగా బంగ్లాదేశ్ లోని గ్రామీణ ప్రాంత ప్రజల వికాసానికి ఆయన చేసిన సేవలకు గాను అమెరికా సహా పలు దేశాలు యూనస్ ను పలు పురస్కారాలతో గౌరవించాయి. మహ్మద్ యూనస్ 2009లో అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డును అందుకున్నారు. తాజాగా ఆయనకు ప్రభుత్వాధినేత బాధ్యతలను అప్పగించడం సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్