ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు ఆయన నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీకి 69 శాతం మంది ప్రజలు మద్దతును తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు ఆయన నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీకి 69 శాతం మంది ప్రజలు మద్దతును తెలియజేశారు. అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోడీ నిలిచారు. మోడీ తరువాత స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ రెండో స్థానంలో ఉన్నారు. జాబితాలో మూడు నుంచి పది స్థానాల్లో వరుసగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెలీ, స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సిలర్ వియోలా, ఐర్లాండ్ మంత్రి సైమన్ హారిస్, యూకే ప్రధాని స్టార్మర్, పోలాండ్ మాజీ ప్రధాని టస్క్, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచేజ్, ఇటలీ ప్రధాని మెలోని ఉన్నారు. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడన్, చైనా అధ్యక్షుడు గానీ లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే భారతదేశానికి వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే.
కొద్దిరోజుల కిందట దేశంలో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి అధికారానికి కావలసిన ఎంపీ స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొలిసారి 2014లో ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన ప్రధానిగా కొనసాగుతూ వస్తున్నారు. 2019లో విజయం సాధించిన తర్వాత రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ.. తాజాగా మూడోసారి భారతదేశానికి ప్రధానిగా ఎన్నికయ్యారు. తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఆయన పర్యటనలు సాగించారు. ప్రపంచ వ్యాప్తంగా కీలక దేశాలతో భారత్ కు సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేయడంలో ప్రధాన మోడీ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన అంతర్జాతీయ నేతగా పేరుగాంచారు. తాజాగా నిర్వహించిన సర్వే కూడా ఆయనకు మరోసారి ఆ స్థాయిలో ప్రతిష్టను తీసుకువచ్చింది. 69 శాతం మంది ప్రజల మద్దతుతో ప్రపంచంలోనే పాపులారిటీ కలిగిన అత్యంత కీలకమైన నేతగా మోడీ నిలిచారు. దీనిపట్ల భారతదేశంలోని మోదీ అభిమానులు, బిజెపి కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచానికి భారత్ ను దిశా, నిర్దేశం చేసే దిశగా దేశాన్ని నిలుపుతున్న ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఆయన చరిష్మా రోజురోజుకు పెరుగుతోందనడానికి ఈ తాజా సర్వే నిదర్శనంగా పలువురు పేర్కొంటున్నారు.