తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి.. విడుదల అయ్యాక గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న కవిత.. అదానీ అంశంతో మళ్లీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడుతున్నారు.
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి.. విడుదల అయ్యాక గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న కవిత.. అదానీ అంశంతో మళ్లీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడుతున్నారు. తాజాగా.. తెలంగాణ జాగృతి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా డిసెంబర్ 4 నుంచి కవిత అధ్యక్షతన తెలంగాణ జాగృతి ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి ఒక షెడ్యూల్ విడుదల చేసింది.
షెడ్యూల్ ఇదే..
డిసెంబర్ 4: వరంగల్ & నిజామాబాద్
డిసెంబర్ 5: కరీంనగర్ & నల్గొండ
డిసెంబర్ 6: రంగారెడ్డి & ఆదిలాబాద్
డిసెంబర్ 7: హైదరాబాద్ & ఖమ్మం
డిసెంబర్ 8: మెదక్ & మహబూబ్‌నగర్