కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకునే విషయాన్ని తనకు కనీసం చెప్పకపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల నుంచి జగిత్యాలలో రాజకీయం చేస్తున్న తనకు కనీసం చేరిక విషయం చెప్పకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

mlc jeevan reddy

ఎమ్మెల్సీ డి జీవన్ రెడ్డి 


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకునే విషయాన్ని తనకు కనీసం చెప్పకపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల నుంచి జగిత్యాలలో రాజకీయం చేస్తున్న తనకు కనీసం చేరిక విషయం చెప్పకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడైన తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాను ఎన్నాళ్లపాటు ఎవరి పైన కొట్లాడాను వారిని తనకు మాట మాత్రం కూడా చెప్పకుండా పార్టీలో చేర్చుకున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారన్న జీవన్ రెడ్డి.. గౌరవం లేని చోట ఉండలేనన్నారు. కనీస గౌరవం దక్కని పార్టీ తనకు ఎందుకని, ఈ ఎమ్మెల్సీ పదవి కూడా తనకు అవసరం లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ తరహా ఏకపక్ష నిర్ణయాలు సరికాదని, స్థానికంగా ఉండే నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చేరికలు ఉండాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలపై కార్యకర్తలతో చర్చించినట్లు ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వారి మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు లేకపోవడం పట్ల వారంతా ఆవేదంలో ఉన్నట్లు జీవన్ రెడ్డి వివరించారు. తన భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని, దానికి అనుగుణంగా తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి ఉంటూ, పార్టీ జెండాను మోసిన వారికి గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పెద్దలపై ఉందన్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉంటూ తీవ్ర ఇబ్బందులకు గురైన కార్యకర్తలను మరింత ఇబ్బందులు గురిచేసేలా వ్యవహరించడం తగదన్నారు. తాను పోరాటం చేసిన నాయకుడిని పార్టీలో చేర్చుకున్నారని, అతనితో ఇప్పుడు కలిసి ఎలా ముందుకు సాగగలమని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇది ఎలా ఉంటే జగిత్యాల ఎమ్మెల్యే చేరిక కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రచ్చకు కారణం అవుతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా సద్దుమనిగిస్తారో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్