మల్యాల మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రవిశంకర్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


|| మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ||

చొప్పదండి నియోజవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మల్యాల మండలంలోని సర్వాపూర్ గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామపంచాయతీ భవనం కోసం భూమి పూజ చేశారు. అలాగే మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. రూ. 60 లక్షలు సర్వపూర్ గ్రామ అభివద్ది కి ఫండ్స్ రిలీజ్ చేశామని ఆయన తెలిపారు. మన ముఖ్యమంత్రి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అన్ని కుల సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధ జలం అందిస్తున్నట్లు తెలిపారు. అన్నదాతలకు అండగా నిలుస్తూ రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ గ్రామానికి రైతు బీమా రూ. 75 లక్షలు సహకారం అందించింది మన ప్రభుత్వం అని తెలిపారు. మన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధి కి 100 కోట్లు మంజూరు చేశారు. ఆసరా పెన్షన్లు అందిస్తున్నారు. కంటి వెలుగు ప్రారంభించాడు. ఈ గ్రామానికి ప్రతి నెల రూ.6,79, 200 పెన్షన్లు వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మీ, 24 గంటల కరెంటు, గ్రామానికి రోడ్లు గ్రామ అభివృద్ది కి 1.50 వేలు వస్తున్నాయి. ఇంకా ఈ గ్రామానికి గ్రామపంచాయితీ కోసం 20 లక్షలు మంజూరు అయ్యాయి. గ్రామపంచాయతీ కోసం 2 గుంటల స్థలాన్ని ఇచ్చిన చైతన్య రెడ్డికి వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. 

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఆకుల గంగమ్మ, సింగిల్ విండో చైర్మన్ ముత్యాల రామలింగారెడ్డి, జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, మల్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మిట్టపెల్లి సుదర్శన్, MPTC సంగని రవి, మహిళా సంఘ కార్యదర్శి ఉమరాణి, మహిళ సంఘ వివోఏ బేతెల్లి సుకన్య, APM చిన్న రాజయ్య, CC ప్రభాకర్, మహిళ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు హాజరైయ్యారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్