బీఆర్ఎస్ సర్కారు ప్రజా సంక్షేమ సర్కారు.. ప్రతి ఓటు కేసీఆర్‌కే: సబితా ఇంద్రారెడ్డి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రచారంలో సబితా ఇంద్రారెడ్డి||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని, ప్రజలను ఆదుకునే ప్రభుత్వం అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో పలువురి చేరికల సందర్భంగా ఆమె మాట్లాడారు. బాలాజీ నగర్ అభివృద్ధికి ఒక మంత్రిగా తన వంతు సహకారం ఎంతో చేశానని మరింత అభివృద్ధి కోసం మళ్లీ గెలిపిస్తే బంగారు భవిష్యత్తు అందజేస్తానని అన్నారు. 30 రోజులు నాకోసం పనిచేయండి ఆ తర్వాత మీకోసం 60 నెలలు పని చేస్తానని అన్నారు. 

119 నియోజకవర్గాలలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోటీ చేస్తున్నారని భావించి ప్రతి ఓటు కేసీఆర్ కు వేస్తున్నట్లు చెప్పాలని ముఖ్యమంత్రి పిలుపు ఇచ్చారని, ఆ దిశగా ప్రతి నాయకుడు కార్యకర్త ముందుకు సాగాలని సబిత ఇంద్రారెడ్డి పిలుపు ఇచ్చారు. రైతు బీమా లాగా 93 లక్షల మందికి బీమా సౌకర్యం కల్పిస్తున్నామని మహిళలకు ప్రతినెల 3000 సహాయం అందజేస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. కార్యకర్తలే అభ్యర్థులుగా ప్రజల్లోకి వెళ్లాలని కారు గుర్తుకు ఓటు వేయమని కోరాలని అన్నారు. 24 గంటల విద్యుత్తు ఇస్తున్నందుకు, రైతుబంధు రైతు బీమా ఇస్తున్నందుకు, ఇంటింటికి నల్లద్వారా నీరు ఇస్తున్నందుకు, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆసరా పెన్షన్లు ఇస్తున్నందుకు, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని, మరిన్ని సంక్షేమ పథకాలు మరింత అభివృద్ధి కావాలి అంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీలో చేరిన నరసింహ మాట్లాడుతూ బాలాజీ నగర్ అభివృద్ధికి సబితా ఇంద్రారెడ్డి గతంలో ఎంతో చేశారని మరింత అభివృద్ధి కోసం మల్లా గెలిస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యం అవుతుందని బాలాజీ నగర్ మొత్తం సబితా ఇంద్రారెడ్డికి పూర్తి మద్దతు తెలుపుతూ రాబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి భారీ నుంచి అతి భారీ మెజార్టీతో గెలిచే విధంగా సహకరిస్తామని తెలిపారు. వడ్డెర సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వం మమ్ములను పట్టించుకోలేదు, కానీ నేడు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి తమ సమస్యలను పరిష్కరించి అన్ని విధాల సహకరిస్తున్నారని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తమ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్