బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్.. మెగా డీఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం

రాష్ట్ర మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలోకి నారా లోకేష్ అడుగుపెట్టారు. 4వ బ్లాక్ ఫస్టు ఫ్లోర్ రూమ్ నెంబర్ 208 ఛాంబర్ లో నారా లోకేష్ బాధ్యతలను తీసుకున్నారు.

Nara Lokesh taking charge

బాధ్యతలు స్వీకరిస్తున్న నారా లోకేష్


రాష్ట్ర మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలోకి నారా లోకేష్ అడుగుపెట్టారు. 4వ బ్లాక్ ఫస్టు ఫ్లోర్ రూమ్ నెంబర్ 208 ఛాంబర్ లో నారా లోకేష్ బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకాన్ని చేసి కేబినెట్ కు పంపించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు లొకేష్ ను కలిసి అభినందనలను తెలియజేశారు. బాధ్యతలు స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఎస్ సవిత, టీజీ భరత్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమేమహేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్ తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. 

చంద్రన్న బీమా 10 లక్షలకు పెంపు 

చంద్రన్న బీమా పరిహార చెల్లింపును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చంద్రన్న బీమా పరిహారం కింద మూడు లక్షలు మాత్రమే చెల్లిస్తుండగా.. ఈ పరిహారం మొత్తాన్ని రూ.10 లక్షల పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. ఈ పరిహారాన్ని త్వరలోనే పాత్రికేయులకు, న్యాయవాదులకు కూడా వర్తింపజేస్తామని ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని చెల్లించలేదని విమర్శించారు. కార్మికులు కార్మిక శాఖలో రూ.15 కట్టి ఈ పథకంలో చేరవచ్చని వెల్లడించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల నష్టపరిహారం అందించనున్నట్లు ఆయన వివరించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్