తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?

తల్లికి వందనం పథకంపై మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకానికి సంబంధించిన విధి, విధానాలను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ పథకంలో భాగంగా ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు.

Minister Nara Lokesh

మంత్రి నారా లోకేష్

తల్లికి వందనం పథకంపై మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకానికి సంబంధించిన విధి, విధానాలను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ పథకంలో భాగంగా ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 72,000 మంది విద్యార్థులు తగ్గారని మంత్రి వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న మంచి విద్యా విధానాలపై అధ్యయనం చేస్తామని తెలిపారు. అయితే, తల్లికి వందనం పథకాన్ని వచ్చే ఏడాది నుంచి నుంచి మాత్రమే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో చేరికలు సరిగా జరగలేదని, పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరలేదన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేరలేదో సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు పరుస్తామని వెల్లడించారు.

అయితే, ఈ పథకంలో భాగంగా పిల్లలు ఎంత మంది చదువుకుంటే అందరికీ సహాయాన్ని అందిస్తామన్నారు. తల్లిదండ్రులు, మేధావులతో చర్చించి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం గురించి ఆశగా ఎదురు చూస్తున్న ఎంతో మంది లబ్ధిదారులకు మంత్రి ప్రకటనతో నిరాశ ఎదురైంది. తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారన్న ఆశతో చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూశారు. అయితే మంత్రి నారా లోకేష్ వచ్చే ఏడాది నుంచి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేయడంతో వారంతా నిరుత్సాహంలో కూరుకుపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు, లబ్ధిదారులు ఎంపికకు సంబంధించి ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లుగా ఒక ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే కాకుండా అందరికీ ఇస్తామని చెప్పడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే మంత్రి ప్రకటన పట్ల వైసిపి విమర్శలు గుప్పిస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పథకం కింద రూ.15000 చొప్పున అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించింది. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే గతంలో టిడిపి హామీలు ఇచ్చిందని, ఇప్పుడు వాటిని తుంగలో తొక్కుతోందంటూ ఆరోపించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్