నేడు వైద్య సేవలు బంద్.. అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు

కలకత్తాలోని ఆర్జి కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేయడంతోపాటు హత్య చేసిన ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో శనివారం వైద్యశాల బంద్ చేపట్టారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అత్యవసర వైద్య సేవలు మినహా ఓపి, ఐపి, ఇతర పరీక్షలను నిలిపివేయనున్నట్లు ఐఎంఏ ప్రకటించింది.

Protesting doctors

నిరసన తెలియజేస్తున్న వైద్యులు

కలకత్తాలోని ఆర్జి కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేయడంతోపాటు హత్య చేసిన ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో శనివారం వైద్యశాల బంద్ చేపట్టారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అత్యవసర వైద్య సేవలు మినహా ఓపి, ఐపి, ఇతర పరీక్షలను నిలిపివేయనున్నట్లు ఐఎంఏ ప్రకటించింది. ఈ బంద్ కు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం ఏపీ రేడియాలజిస్ట్ అసోసియేషన్ ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ జూనియర్ వైద్యుల సంఘం ఏపీ గైనిక్ వైద్య నిపుణుల సంఘం ఈ బందుకు మద్దతును ప్రకటించాయి. అలాగే పలు విద్యార్థి ప్రజా సంఘాల కూడా ఈ బందుకు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఆర్జీ కర్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన యువతకి న్యాయం చేయాలన్న డిమాండ్ తో ఈ బంద్ చేపడుతున్నారు. తక్షణమే నిందితులను పట్టుకుని ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా వైద్య రంగంలో పనిచేసే వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించేలా నేషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతున్నారు.

ఆసుపత్రులు వద్ద వైద్యులకు రక్షణ కల్పించేలా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యులపై దాడి చేసే వారికి కొద్ది గంటల్లోనే శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఆసుపత్రి లో వైద్యురానిపై అమానుసానికి పాల్పడిన దుండగులను శిక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందన్న భావనను వైద్య వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే జుడా ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. వీరికి సంఘీభావంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిగిలిన వైద్య సంఘాలు కూడా శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు బంద్ చేపడుతున్నాయి. ప్రభుత్వం బాధ్యత యువత కుటుంబానికి న్యాయం చేసేంతవరకు తాము అండగా ఉండాలని వైద్య సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. నిందితులకు కఠిన శిక్ష విధించేంతవరకు తాము నిరసనలోనే ఉంటామని జూనియర్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. శనివారం వైద్య సేవలను పూర్తిగా బహిష్కరిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. వైద్యురాలిపై జరిగిన ఘటనను ప్రజలకు వివరించేలా కరపత్రాల పంపిణీకి జుడా పిలుపునిచ్చింది. వైద్య సేవలో నిలుపు వేయడానికి గల కారణాలను ప్రజలకు వివరించనున్నారు. వైద్య వృత్తిలో ఉంటున్న తాము ప్రాణాలను కాపాడుతున్నామని, అటువంటి తమ మానప్రాణాలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని జూనియర్ వైద్యులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్