బిజెపి జాతీయ అధ్యక్షుడిగా మౌర్య.. మోడీ, అమిత్ షాకు అత్యంత ఆత్మీయ నేత

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేసవ ప్రసాద్ మౌర్యను నియమించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. మౌర్య యూపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే 2017లో యూపీలో బిజెపి అధికారంలోకి వచ్చింది. పార్టీలో కిందిస్థాయి నుంచి ఎదిగిన ఆయనకు అవకాశం కల్పించవచ్చన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. మౌర్య వెనుకబడిన వర్గాలకు చెందిన నేత కావడంతో బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని బిజెపి అగ్ర నేతలు భావిస్తున్నారు

Kesava Prasad Maurya

 కేసవ ప్రసాద్ మౌర్య

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేసవ ప్రసాద్ మౌర్యను నియమించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. మౌర్య యూపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే 2017లో యూపీలో బిజెపి అధికారంలోకి వచ్చింది. పార్టీలో కిందిస్థాయి నుంచి ఎదిగిన ఆయనకు అవకాశం కల్పించవచ్చన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. మౌర్య వెనుకబడిన వర్గాలకు చెందిన నేత కావడంతో బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని బిజెపి అగ్ర నేతలు భావిస్తున్నారు. ప్రధాని మోదీ హోం మంత్రి అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడైన మౌర్యను 2017లోనే యూపీ ముఖ్యమంత్రిగా నియమించాలనుకున్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగడంతో అది సాధ్యం కాలేదు. మౌర్యకు, యోగికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్నట్టు విభేదాలు ఉన్నాయని, యోగి ప్రతి కదలికను ఆయన ఢిల్లీకి చేరవేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా పార్టీ కంటే ఎవరు గొప్ప కాదని బుధవారం మౌర్య చేసిన ప్రకటన చర్చకు దారితీసింది.

మౌర్య ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలను కలిసి వెళ్లిన తరువాత ఈ ప్రకటన చేయడంతో మౌర్య ద్వారా ఢిల్లీ నేతలు యోగికి సందేశాలు పంపినట్టు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో గత లోక్ సభ ఎన్నికల్లో బిజెపి పలు సీట్లు కోల్పోవడంపై యోగిని జవాబుదారీ చేయాలని అధిష్టానం భావిస్తోంది. అయితే, ఈ ఓటమితో తనకు సంబంధం లేదని, తనను సంప్రదించకుండా అభ్యర్థులను ఎంపిక చేశారని యోగి అన్నట్టు సమాచారం. త్వరలో యూపీలో పది అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు యోగి భవిష్యత్తును నిర్ణయించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తోపాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు లోక్ భకు ఎంపీ కావడం, ఒక సమాజ్వాది ఎమ్మెల్యేపై అనర్హత వేటుపడటంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ పది సీట్లలో గతంలో ఐదు సీట్లు ఎస్పీ గెలుచుకున్నావే. ఈ ఉప ఎన్నికలకు ముందే బిజెపికి జాతీయ అధ్యక్షుడిగా కేశవ ప్రసాద్ మౌర్యను నియమిస్తారా..? లేదా..? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, యోగి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మౌర్యను జాతీయ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా యోగిని ఇరకాటంలోకి నెట్టాలని బిజెపి అగ్ర నేతలు భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్