||మల్రెడ్డి జగన్మోహన్ రెడ్డి||
(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
తెలంగాణలో దొరల పాలనకు, మహేశ్వరంలో సబితమ్మ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు ఆయన మా ప్రతినిధితో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లడానికి యువత గత వారం రోజులుగా శ్రమిస్తూ పనిచేస్తుందని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చి చేతి గుర్తుపై ఓటు వేయాలని ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామని నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తోనే సంక్షేమ రాజ్యం సాధ్యమని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో మహిళా ఓటర్ల నుండి అనుహ్య స్పందన వస్తుందని తెలిపారు. మహిళలకు నెలకు ₹2,500 బస్సులలో ఉచిత ప్రయాణం పెన్షన్లు నాలుగువేల రూపాయలకు పెంపు విషయమై ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు దీనితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి 6 గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని అన్నారు. మహిళలకు 15 వేల తో పాటు రేషన్ షాప్ లో ఒకరికి 8 కిలోల చొప్పున సన్నబియ్యం గృహ లక్ష్మీ పథకం కింది ₹2500 నగదు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే పథకాలు ప్రజలలో విపరీతమైన చర్చకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి పెరిగిందని భూకబ్జాలు పెరిగిపోయాయని అనేక చోట్ల శిలాఫలకాలు దిష్టిబొమ్మలుగా మిగిలిపోయాయని అన్నారు.
భారత రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని దానితో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. స్థానిక మంత్రి అనేక సమస్యలు పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కున్న చరిత్ర స్థానిక మంత్రిదని అన్నారు. ఏ నిరుద్యోగి గత పది సంవత్సరాల లో ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు అన్ని వర్గాలకు సమన్యాయం అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఋణం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అమరుల ఆశయ సాధనకు కృషిచేసి ఆదర్శవంతమైన తెలంగాణను తీర్చిదిద్దడం కాంగ్రెస్ కే సాధ్యమవుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఇష్టానుసారంగా ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు.