ద్వితీయ శ్రేణి పౌరులుగా మెజారిటీ వర్గాలు : ప్రధాని మోదీ

దేశంలోని మెజారిటీ వర్గాలను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చాలనదే ఇండియా కూటమి ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి చేస్తున్న మూడు భారీ కుట్రలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి తాను వచ్చినట్లు వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ


దేశంలోని మెజారిటీ వర్గాలను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చాలనదే ఇండియా కూటమి ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి చేస్తున్న మూడు భారీ కుట్రలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి తాను వచ్చినట్లు వెల్లడించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ముందుగా రాజ్యాంగాన్ని మార్చి దేశంలో మత ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించాలని కొత్తగా రాస్తారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తారని పేర్కొన్నారు. మొత్తం రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చేస్తారని వివరించారు. ఓబీసీ రిజర్వేషన్లను తప్పించేందుకు మూడో పద్ధతిని రూపొందించారని మోడీ విమర్శించారు. రాత్రికి రాత్రి ముస్లిం కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఓటు జీహాద్ కు పిలుపునిస్తున్న కాంగ్రెస్, సమాజ్వాది పార్టీలకు సరిహద్దు వెంబడి ఉన్న జీహాద్లు మద్దతిస్తున్నారని, ఈ పార్టీలు గెలుపు కోసం పాకిస్తాన్ లో ప్రార్థనలు జరుగుతున్నాయని మోడీ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు సహకరించాలన్నారు. గడిచిన పదేళ్లలో దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వర్తించామని, మరింతగా భారత్ ఎదిగేందుకు అవసరమైన సహకారాన్ని ప్రజలు ఓట్ల రూపంలో తమకు అందించాలని కోరారు. భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిపేందుకే భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇండియా కూటమి నాయకులు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను పట్టించుకోవద్దని, దేశ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని సూచించారు. తాజా ఎన్నికల్లో బిజెపి 400కుపైగా సీట్లను సాధించడం త తధ్యమన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్