కాంగ్రెస్‌తోనే స్వర్ణయుగ పాలన: మహేశ్వరం కాంగ్రెస్ నేత కొల్లూరు వంశీ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||కొల్లూరు వంశీ||

(రంగారెడ్డి ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

రాష్ట్రంలో దేశంలో సబండ వర్గాలకు స్వర్ణ యుగం పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మహేశ్వరం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు కొల్లూరు వంశీ అన్నారు. సోమవారం నాడు ఆయన మా ప్రతినిధితో మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ ను గెలిపించాలని అభ్యర్థిస్తే ఓటర్ల నుండి విశేష స్పందన లభిస్తుందని పేదలకు అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. తెలంగాణలో మార్పు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ సమన్యాయం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

‘మహాలక్ష్మి’తో మహిళలకు రక్షణ

మహాలక్ష్మి పేరుతో కాంగ్రెస్ మహిళలకు రక్షణ కల్పిస్తుందని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం మహిళల సమస్యలను పట్టించుకోలేదని కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మహిళలకు పెద్దపీట వేస్తుందని మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మినీ పేస్టో అమలు అయితే రాష్ట్రం సుభిక్షం అవుతుందని కాంగ్రెస్ అంటేనే ఒక సెక్యులర్ పార్టీ అని భారత రాష్ట్ర సమితి ఒక అవినీతి పార్టీ అని ప్రజలందరూ గుర్తించారని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి చేసింది తక్కువ చెప్పేది ఎక్కువ అని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని అభ్యర్థించారు. ఎన్నికలు వచ్చాయని మరొకసారి పేద ప్రజలను మోసం చేసేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమైందని ఓటు కోసం వస్తే పది ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించాలని కోరారు. బీసీ బందు మైనార్టీ బందు పథకాలను టిఆర్ఎస్ బందులుగా టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పంచుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. 

నిజమైన లబ్ధిదారులను మోసం చేసి భారత రాష్ట్ర సమితి నేతలకే పథకాలు పనికి పెట్టుకున్నారని విమర్శించారు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలో కలవకుంట్ల ప్రభుత్వం తీసుకొనిందని ఆరోపించారు పేదలు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో కాపీ కొట్టి భారత రాష్ట్ర సమితి విడుదల చేసిందని ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఎవ్వరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు మరొకసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలంతా విషయాన్ని గమనించి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు.భారత రాష్ట్ర సమితి పార్టీలో అవినీతి పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు దాదాపు పది సంవత్సరాలు భారత రాష్ట్ర సమితి పొలంలో కమిషన్లు భూకబ్జాలతో బాగుపడ్డది కేవలం ఒకే ఒక కుటుంబం తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా తమకు మద్దతు తెలుపుతున్నారని కబ్జాలకు పాల్పడ్డ వారి శిక్ష అనుభవించక తప్పదని అన్నారు.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్