||ప్రచారంలో మెట్టుకాడి శ్రీనివాస్||
(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
ఉద్ధండులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులతో పోటీపడుతూ మెట్టుకాడి శ్రీనివాస్ మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు అందులో భాగంగా సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా రామచంద్రాపురంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మెట్టుకాడి శ్రీనివాస్‌కు ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఆహ్వానించారు. బీసీ అభ్యర్థిగా తనను ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల మధ్యలో ఉండి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని శ్రీనివాస్ హామీ ఇస్తున్నారు. గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీలు ఏవీ పాలమూరుకు ఏమీ చేయలేదని, తనకు ఒకసారి అవకాశం ఇస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఏ గ్రామంలోకి వెళ్లినా అనూహ్యమైన స్పందన లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. అనేక గ్రామాలలో పెన్షన్ రాక వృద్ధులు అవస్థలు పడుతున్నారని, అలాంటి వారిని ఆదుకోవడంలో అధికార పార్టీ విఫలమైందని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సమస్యలను దగ్గరుండి తీరుస్తానని పేర్కొన్నారు.