||వీరభోగ వసంత రాయలు||
(ఎల్బీనగర్, ఈవార్తలు ప్రతినిధి, దేవులపల్లి రంగారావు)
అధికారం కొందరి సొత్తు కాదు.. రాజ్యాధికారం మన అందరి సొత్తు అంటూ, అందరికీ సమాన అవకాశాలు కావాలని డాక్టర్ వీరబోగ వసంత రాయులు ప్రజాపతి అంటున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన.. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించిందని, ఎవరూ ప్రత్యేకం కాదని అన్నారు. శాలివాహన కులస్తుల అభ్యున్నతి కోసం తాను కృషి చేస్తానని తెలిపారు. ఎల్బీనగర్లో యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని, ఎల్బీనగర్లో కేంద్రీయ విద్యాలయ సంస్థ (కేవీఎస్) సైనిక్ నవోదయ పాఠశాలల ఏర్పాటు, ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు, భూకబ్జాకు గురి అయిన భూమిని పేదలకు అందజేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక వైద్యుడిగా 20 సంవత్సరాలు ఎల్బీనగర్ ప్రజలకు వైద్య సేవలు అందజేస్తున్న తనకు ఒకసారి అవకాశం కలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.
గత ఆరు రోజుల నుండి ఇంటింటికీ కుట్టు మిషన్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తే, వారి నుండి సంపూర్ణ సహకారం లభిస్తోందని అన్నారు. గతంలో శ్రీశ్రీశ్రీ ధరణి రాయిని కొండ మహిషాసురమర్ధిని దేవాలయం సంస్థాగత పూజారిగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఇక్కడ ప్రజల సమస్యలు తనకు తెలుసని వెల్లడించారు. ఆ సమస్యలకు పరిష్కారం కూడా తన వద్ద ఉందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంతా ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంచారని, గత 20 సంవత్సరాలుగా సామాజిక సేవలో ఉన్న తాను ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.