||మధుయాష్కీ గౌడ్||
(ఎల్బీనగర్, ఈవార్తలు ప్రతినిధి, దేవులపల్లి రంగారావు)
ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా తాను గెలిస్వతే సంక్షేమ సంఘాలకు బెదిరింపులు ఉండవని ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ అన్నారు. లింగోజిగూడ డివిజన్లో జిహెచ్ఎంసి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దరిపల్లి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మార్పు కోసం మధుయాష్ కి కార్యక్రమంలో డివిజన్లోని వివిధ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వారిని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు ఈ సందర్భంగా ఎల్బీనగర్ హనుమాన్ దేవస్థానం డైరెక్టర్ ఉద్యమకారుడు జూపల్లి ప్రవీణ్ టిఆర్ఎస్ కు రాజీనామా చేసి మధు యాష్ కి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు జిల్లా కన్వీనర్ పల్లె వినయ్ కుమార్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ పార్టీలో చేరారు యశ్వంత్ ప్రవీణ్ రెడ్డి రోహిత్ రెడ్డి రాజేశ్వరి వాసు రమేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తా
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని అలాంటి న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని మధు ఎస్కే గౌడ్ పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల ఫ్రెండ్లీ సమావేశాన్ని సుష్మావద్ద నిర్వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్ కి మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు నాయకులు జెక్కిడి ప్రభాకర్ రెడ్డి వజీర్ ప్రకాష్ గౌడ్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఓటమి భయంతో అధికార దుర్వినియోగం
ఓడిపోతామని భయంతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సుధీర్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని కాలనీ సంఘాల అధ్యక్షులను తన కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడుతున్నాడని మధు యాష్కి గౌడ్ ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మనుసురాబాదు డివిజన్లోని చంద్రపురి కాలనీ సహారా ఎస్టేట్ కమ్యూనిటీ హాళ్లలో కాలనీవాసులతో సమావేశాలు నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు బుడ్డా సత్యనారాయణ స్వర్ణ మాధవి పాల్గొన్నారు. కాగా, మధుయాష్కి గౌడ్ సమక్షంలో చంపాపేట డివిజన్ కర్మన్ ఘాటుకు చెందిన మాజీ కౌన్సిలర్ పాలెం బిక్షపతి గౌడ్ భారత రాష్ట్ర సమితి నాయకులు పెంటయ్య గౌడ్ ఎరుకల లక్ష్మణ్ గౌడ్ ప్రభాకర్ గౌడ్ చేగోని విటల్ గౌడ్ దశరథ్ ముదిరాజు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు కార్యక్రమంలో నాయకులు, గారగోని ప్రవీణ్ గౌడ్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.