బ్రిటన్ లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం దిశగా ముందుకు సాగుతోంది. 650 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో లేబర్ పార్టీ విజయం సాధిస్తోంది. బ్రిటన్ లోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తన్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఉన్న 650 స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి.
రిషి సునాక్
బ్రిటన్ లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం దిశగా ముందుకు సాగుతోంది. 650 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో లేబర్ పార్టీ విజయం సాధిస్తోంది. బ్రిటన్ లోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తన్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఉన్న 650 స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీతోపాటు మరికొన్ని పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి లేబర్ పార్టీ స్పష్టమైన విజయం దిశగా ముందుకు సాగుతోంది. లేబర్ పార్టీ 298 స్థానాల్లో ఆధిక్యం సాధించి విజయం దిశగా ముందుకు సాగుతుండగా, అధికార కన్జర్వేటివ్ పార్టీ 61 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇతరులు మరో 54 స్థానాల్లో విజయం సాధించారు.
మిగిలిన స్థానాల్లో కూడా అధికార మిగిలిన స్థానాల్లో కూడా అధికార పార్టీ వెనుకబడినట్లు తెలుస్తోంది. లేబర్ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా కీర్ స్మార్ట్ బరిలో నిలువగా, కన్జర్వేటివ్ పార్టీ నుంచి మరోసారి భారత సంతతికి చెందిన రిషి సునాక్ బరిలో నిలిచారు. ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సునాక్ అనూహ్యంగా పరాజయం చెందడం గమనార్హం. మిగిలిన స్థానాలకు సంబంధించిన ఫలితాలు ప్రస్తుతం వెలువడుతున్నాయి. బ్రిటన్ ఎన్నికల ఫలితాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు తన రాజకీయ భవిష్యత్తును మార్చేవుగా రిషి భావించారు. అయితే, అనూహ్యంగా ఓటమి పాలు కావడం గమనార్ధం. ఫలితాలకు ముందే ట్విట్టర్లో స్పందించిన ఆయన.. ఓటర్లకు, పార్టీ అభ్యర్థులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి నిలిచిన కీర్ స్మాటర్ కూడా తన విజయంపై తొలి నుంచి నమ్మకంతోనే ఉన్నారు. మార్పు చెందిన లేబర్ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలకు ఓటర్లకు ధన్యవాదాలు ఆయన తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ స్పష్టం చేశారు.