ఫార్ములా-ఈ కార్ రేస్ (formula e car race) వ్యవహారంలో హైడ్రామా నడుస్తోంది. నేడు ఏసీబీ (ACB) విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్(KTR) ఏసీబీ కార్యాలయానికి వెళ్లగా.. ఆయన అడ్వొకేట్‌ను అధికారులు లోపలికి అనుమతించలేదు.
పోలీసులతో కేటీఆర్
హైదరాబాద్, ఈవార్తలు : ఫార్ములా-ఈ కార్ రేస్ (formula e car race) వ్యవహారంలో హైడ్రామా నడుస్తోంది. నేడు ఏసీబీ (ACB) విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్(KTR) ఏసీబీ కార్యాలయానికి వెళ్లగా.. ఆయన అడ్వొకేట్‌ను అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. తన అడ్వొకేట్‌ను లోపలికి అనుమతిస్తేనే విచారణకు హాజరవుతానని స్పష్టంచేశారు. అయినా, అధికారులు కేటీఆర్ తరఫు న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవటంతో.. లిఖిత పూర్వక సమాధానం ఇచ్చి కేటీఆర్ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం నడుస్తోందని, తనపై కుట్రపూరితంగా తప్పుడు స్టేట్‌మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తన న్యాయవాదితో హాజరైతే తప్పేంటని ప్రశ్నించారు. అనంతరం నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారు. కాగా, అంతకుముందు నందినగర్‌లోని తన నివాసంలో న్యాయవాదులతో మాట్లాడి, వారితో కలిసి ఏసీబీ కార్యాలయానికి విచ్చేశారు. అయితే ఏసీబీ ఆఫీస్ వద్ద కేటీఆర్ కారును పోలీసులు అడ్డుకొన్నారు. లీగల్ టీమ్‌కు అనుమతి లేదని, వారిని దింపేస్తేనే ఆఫీస్‌లోకి రావాలని స్పష్టం చేశారు.
దీంతో.. లీగల్ టీమ్ ఉంటే అభ్యంతరం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలని అన్నారు. పోలీసులపై నమ్మకం లేనందునే లాయర్లతో వచ్చానని.. లీగల్ టీమ్‌తో రావద్దని నోటీసుల్లో ఉందా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. సుమారు 100 మంది బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు.. కేటీఆర్ రిప్లై ఆధారంగా నోటీసు జారీ చేసేందుకు ఏసీబీ సిద్ధం అవుతోంది. కాసేపట్లో కేటీఆర్‌కు ఏసీబీ నోటీస్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.