కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ కు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో కేటీఆర్ విమర్శలను గుప్పించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రాంతంలో గల్లి గల్లికి తిరిగిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ కు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో కేటీఆర్ విమర్శలను గుప్పించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రాంతంలో గల్లి గల్లికి తిరిగిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తారా..? అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు దాటిందని ఇంత వరకు ఉద్యోగాలు ఇచ్చింది లేదని ఆరోపించారు.
ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పకుండా జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఎటు పోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు వచ్చినట్టుగా ఇప్పుడు కూడా ఒకసారి రాహుల్ గాంధీ హైదరాబాదులోని అశోక్ నగర్ కు రావాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆహ్వానించారు. ఇక్కడ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతతో మాట్లాడి ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో యువకులతో వచ్చి మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం పట్ల కేటీఆర్ స్పందించారు. తమకు పోరాటం కొత్త కాదని స్పష్టం చేశారు. నిరుద్యోగుల కోసం అవసరమైతే ఢిల్లీలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బూతులు తిట్టినా, అవమానించిన ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.