ఏపీలో జగన్‌కు షాక్.. మొదలైన వలసలు.. టీడీపీలోకి కోటంరెడ్డి సోదరుడు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||నెల్లూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు||

ఈవార్తలు, ఏపీ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సాఆర్‌సీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. మొన్నకి మొన్న రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకోగా, నిన్న హైడ్రామా మధ్య ఒక ఎమ్మెల్సీ సీటు టీడీపీ వశమైంది. ఎమ్మెల్యేల కోటాలో విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా, వైసీపీ తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి ఈ రోజు టీడీపీలో చేరనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీలో చేరుతున్నానని, ఈ కార్యక్రమానికి అందరూ తరలివచ్చి ఆశీర్వదించి మద్దతు తెలపాలని చంద్రబాబు, నారా లోకేశ్ ఫ్లెక్సీలతో నగరాన్ని నింపేశారు.

నగర వ్యాప్తంగా భారీ ప్రదర్శన అనంతరం.. తాడేపల్లికి తరలివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత చంద్రబాబు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన గిరిధర్ రెడ్డి.. తన సోదరుడు శ్రీధర్ రెడ్డితో పాటు కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు టీడీపీలో చేరనుండటం గమనార్హం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్