ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తన కర్కసత్వాన్ని ప్రదర్శించాడు. ఆ దేశ ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే కిమ్ అధికారులు పట్ల కూడా అంతే స్థాయిలో వ్యవహరించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 30 మంది అధికారులకు ఉరిశిక్షను విధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరదలను నియంత్రించడంలో విఫలమయ్యారంటూ 30 మంది అధికారులకు ఉరిశిక్షను ఖరారు చేశాడు.
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తన కర్కసత్వాన్ని ప్రదర్శించాడు. ఆ దేశ ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే కిమ్ అధికారులు పట్ల కూడా అంతే స్థాయిలో వ్యవహరించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 30 మంది అధికారులకు ఉరిశిక్షను విధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరదలను నియంత్రించడంలో విఫలమయ్యారంటూ 30 మంది అధికారులకు ఉరిశిక్షను ఖరారు చేశాడు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉత్తర కొరియాలో ఇటీవల భారీ స్థాయిలో వర్షాలు, వరదలు ముంచెత్తాయి. కొండ చరియలు కూడా విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో సుమారు నాలుగు వేల మంది మరణించినట్లు దాదాపు ఐదు వేల మందికిపైగా నిరాశ్రయులు అయినట్లు ఆదేశం మీడియా చెబుతోంది. వరదల వల్ల సంభవించిన ప్రాణ నష్టాన్ని నివారించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారు. దీనిపై ఆదేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర ఆగ్రహాన్ని అధికారులపై వ్యక్తం చేశారు. వరదలను, వర్షాలను నియంత్రించడంలో విఫలమైన సుమారు 30 మంది అధికారులను ఉరితీయాలని ఆయన కీలక ఆదేశాలు జారీ చేసినట్లు ఉత్తర కొరియా మీడియా పేర్కొంది.
దేశానికి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారని, వారికి మరణ శిక్ష విధించినట్లు ఆ దేశ మీడియా ఆయా కథనాల్లో వెల్లడించింది. ఇది ఎలా ఉంటే ఇటీవల చాగాంగ్ ప్రావిన్స్ లో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది మరణించారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పర్యటించారు. మోకాలు లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన.. ఆ తరువాత వరదనీతిలో బోటుపై వెళ్లారు. వరదల తీవ్రతను ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు. పంట పొలాలను కూడా ఆయన పరిశీలించారు. ఈ స్థాయిలో విపత్తును ముందు గుర్తించడంలో విఫలం కావడంతోపాటు అనంతరం నిర్వహించాల్సిన సహాయక కార్యక్రమాలను ఆశించిన స్థాయిలో చేయకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అందుకు కారణమైన అధికారులకు కఠిన శిక్షణ విధించారు. ఈ భారీ విపత్తు నుంచి కోలుకొని తిరుగు నిర్మాణాలు చేపట్టడానికి రెండు మూడు నెలలు పడుతుంది అని అధికారులు చెబుతున్నారు. మరణశిక్ష విధించిన అధికారులు వివరాలను స్థానిక మీడియా ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే గత నెల ఆఖరిలోనే ఈ శిక్ష అమలు చేశారని నార్త్ కొరియా అధికారికి మీడియా ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.