వైఎస్ జగన్ ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చా: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||ఖమ్మం ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, దాన్ని చేసి చూపిస్తానని, రాబోయే చదరంగం, కురుక్షేత్రంలో దాని ప్రభావం కనిపిస్తుందని జిల్లా మాజీ ఎంపీ పొంగులేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కురుక్షేత్ర యుద్ధానికి మీ శీనన్న సిద్ధంగా ఉన్నాడని ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్‌లో రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 2 వేల మంది నిరుద్యోగులతో ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2013 ఫిబ్రవరి 23వ తేదీన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన 13 నెలల్లోనే ప్రజల ఆశీస్సులతో ఎంపీగా గెలిచానని వెల్లడించారు. గత నాలుగేండ్లుగా ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటున్నానని పేర్కొన్నారు. 


ప్రజలకు తోడు నీడగా ఉంటూ కష్టం వస్తే మీ శీనన్న ఉన్నాడనే నమ్మకాన్ని, భరోసాను కల్పించానని వివరించారు. వారి ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. విద్యతోనే ఏదైనా సాధ్యమని, విద్యార్థులు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్