ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పాలనలో జోరు పెంచింది. ముఖ్యంగా పథకాల అమలు, పేర్లు కొనసాగింపు కు సంబంధించి కీలక ఆదేశాలను మంగళవారం జారీ చేసింది. 2019 ఏడాదికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పాలనలో జోరు పెంచింది. ముఖ్యంగా పథకాల అమలు, పేర్లు కొనసాగింపు కు సంబంధించి కీలక ఆదేశాలను మంగళవారం జారీ చేసింది. 2019 ఏడాదికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019 - 24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు పేర్లను తొలగించాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పేర్లు లేకుండానే పథకాలను కొనసాగించాల్సిందిగా అధికారులకు ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. అదేవిధంగా పార్టీల రంగులు, జెండాలతో ఉన్న పాసుపుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు సర్టిఫికెట్లు జారీని వెంటనే నిలిపివేయాలని సూచించింది. తాజా ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటివరకు అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన పేర్లే ఉన్నాయి. ఆ పేర్లను ప్రస్తుతం మారనున్నాయి. ఆయా పథకాలను కొనసాగించాలో, మార్పులు చేయాలో అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అనంతరం వాటికి పేర్లు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అందుకు అనుగుణంగా అనేక పథకాలను కూడా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయా పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తారు, వాటికి ఎటువంటి పేర్లు పెట్టాలి, ఆయా పథకాలకు లబ్ధిదారులు ఎంపిక సంబంధించిన విధి విధానాలు ఖరారు పై ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి సారించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరిగిన పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పటికే నాలుగు వేలకు పెంచారు. పెరిగిన పెన్షన్ సొమ్మును వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వంలో ఎంపికైన వాలంటీర్లను కొనసాగిస్తారా..? వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేస్తారా అన్నదానిపై కొద్దిరోజుల్లోనే స్పష్టత రానుంది.