రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ విందు ఇచ్చారు. ఈ విందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో భాగంగా రష్యా తరపున ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులకు త్వరలోనే విముక్తి కల్పించేందుకు పుతిన్ అంగీకరించినట్లు తెలిసింది.
నరేంద్ర మోడీ, వ్లాదిమిర్ పుతిన్ భేటీ
రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ విందు ఇచ్చారు. ఈ విందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో భాగంగా రష్యా తరపున ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులకు త్వరలోనే విముక్తి కల్పించేందుకు పుతిన్ అంగీకరించినట్లు తెలిసింది. రష్యాకు వెళ్లిన కొందరు భారతీయులు అనూహ్య పరిస్థితిలో అక్కడ ఆర్మీ వద్ద చిక్కిపోయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధంలో వారంతా మాస్కో సైన్యానికి సహాయకులుగా పని చేస్తున్నారు. అయితే, వీరిని వదిలి పెట్టేందుకు రష్యా ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోడీ, పుతిన్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మాస్కోకి చేరుకున్నారు. ఆయన గౌరవార్థం రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం రాత్రి ప్రధాని మోడీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేట్ డిన్నర్ లో యుద్ధంలో పని చేస్తున్న భారతీయుల అంశాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. మోడీ లేవనెత్తిన అంశంపై సానుకూలంగా స్పందించిన రష్యా అధినేత పుతిన్.. ఉక్రెయిన్ యుద్ధంలో వీధుల్లో ఉన్న భారతీయులను బయటకు తీసుకొచ్చి క్షేమంగా స్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా చర్యలను వేగవంతం చేస్తామని ప్రధాని మోదీకి హామీ ఇచ్చినట్లు తెలిసింది. పుతిన్ సానుకూలంగా స్పందించడం పట్ల ప్రధాని మోడీ కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, ఉద్యోగాలు ఉపాధి అవకాశాల ఆశ చూపి భారత్ నుంచి కొంత మంది యువకులను మోసపూరితంగా రష్యా తరలించి ఉక్రెయిన్ తో యుద్ధంలోకి దింపిన విషయం తెలిసిందే. ఇలా ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన నలుగురు భారతీయులు యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అప్పట్లో కేంద్ర విదేశాంగ శాఖ స్పందించి మాస్కో అధికారులతో సంప్రదింపులను జరిపింది. ఈ క్రమంలోనే కొందరు భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇంకా ఉక్రేయంతో రష్యా చేస్తున్న యుద్ధంలో 40 మంది వరకు యువకులు పాల్గొంటున్నారు. దీనిపై ప్రధాని మోడీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చించి వారిని భారత్ కు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విందు సమావేశంలో ఇరు దేశాల అధినేతలు ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం సహ పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, యుద్ధ భూమిలో దేనికి పరిష్కారాలు లభించవని ప్రధాన మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యమే ముందుకెళ్లే మార్గాలని ఈ సందర్భంగా ప్రధాన మోడీ.. పుతిన్ కు సూచించారు. 2022లో ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమైన తరువాత ప్రధాని మోడీ తొలిసారి రష్యా పర్యటనకు వెళ్లారు. ఇక భారత ప్రధానిగా మోడీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన రష్యాలో పరీక్షించడం ఇదే తొలిసారి. మూడోసారి భారత ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టడం పట్ల రష్యా అధినేత పుతిన్.. మోదిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇది యాదృచ్ఛికంగా సాధించిన విజయం కాదని, ఎన్నో ఏళ్లుగా మోడీ చేసిన చేసిన కృషికి, శ్రమకు దక్కిన ఫలితంగా పుతిన్ పేర్కొన్నారు.