కేసీఆర్‌ ప్రధాని కావాలని కలగన్నారు.. నిరాశే మిగిలింది : మంత్రి జూపల్లి కృష్ణారావు

తెలంగాణలోని 16 ఎంపీ స్థానాలను గెలిచి ప్రధాని కావాలని కేసీఆర్‌ కల గన్నారని, అయితే ఆ కలలు కల్లలే అయ్యాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. బీజేపీకి పార్లమెంట్‌లో అనేక అంశాల్లో కేసీఆర్‌ మద్ధతు ఇచ్చారని విమర్శించారు. అయితే, బీజేపీ నుంచి ఆ స్థాయిలో మద్ధతు ఆయనకు లభించలేదన్నారు.

Minister Jupalli Krishna Rao

మంత్రి జూపల్లి కృష్ణారావు

తెలంగాణలోని 16 ఎంపీ స్థానాలను గెలిచి ప్రధాని కావాలని కేసీఆర్‌ కల గన్నారని, అయితే ఆ కలలు కల్లలే అయ్యాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. బీజేపీకి పార్లమెంట్‌లో అనేక అంశాల్లో కేసీఆర్‌ మద్ధతు ఇచ్చారని విమర్శించారు. అయితే, బీజేపీ నుంచి ఆ స్థాయిలో మద్ధతు ఆయనకు లభించలేదన్నారు. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో విజయం సాధించి ప్రధాని అవ్వాలని కేసీఆర్‌ కలలు కన్నారన్నారు. కానీ, అది నెరవేరలేదన్నారు. కేసీఆర్‌ మంచిగా పరిపాలిస్తే కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారని జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ప్రజలు ఎక్కడైనా తప్పు చేస్తారా..? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను కేసీఆర్‌ అమలు చేయలేదని స్పష్టం చేశారు.

దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్‌ సీఎం అయ్యారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని విమర్శించే అర్హత భారతీయ రాష్ట్ర సమితి నేతలకు లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలకు విలువలు లేవని, నిజాయితీ లేని పార్టీ బీఆర్‌ఎస్‌ అని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీ చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయిందని, దీని బట్టి ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదన్న విషయం అర్థమవుతోందన్నారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పటికైనా నాయకులు ఆలోచన చేయాలన్నారు. ప్రజా మద్ధతు కూడగట్టుకోవడంపై దృష్టి సారించాల్సిందిపోయి విమర్శలు చేయడం తగదన్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్