బీఆర్‌ఎస్ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు కోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, సీబీఐ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన రెండు కేసుల్లో ఆమె బెయిల్ కోసం కొద్ది నెలలుగా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కల్వకుంట్ల కవిత
బీఆర్‌ఎస్ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు కోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, సీబీఐ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన రెండు కేసుల్లో ఆమె బెయిల్ కోసం కొద్ది నెలలుగా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమె బెయిల్ కోసం కొన్నాళ్లు నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకు కోర్టు నుంచి అనుమతి లభించడం లేదు. తాజాగా ఆమె దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను కూడా ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపగా, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈడీ, సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
సీవిఐ అవినీతి కేసుతోపాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత చేసిన బెయిల్ దరఖాస్తును కొట్టివేస్తూ మే నెల ఆరో తేదీన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఇవ్వగా, దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. హైకోర్టులో కూడా చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటి వరకు 50 మంది వరకు నిందితులు ఉండగా, అందులో కవిత ఒకరు. ఈ లిక్కర్ స్కామ్‌లో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేశారు.