నేను గెలిస్తే కార్యకర్తలే నా వారసులు: ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||మధుయాష్కీ గౌడ్ Photo: Facebook||

(ఈవార్తలు, ఎల్బీనగర్ ప్రతినిధి, దేవులపల్లి రంగారావు)

ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. వారికి కాంగ్రెస్ మాజీ కార్యదర్శి జెక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో కార్యకర్తలే నా వారసులు అవుతారని అన్నారు. ఎన్కౌంటర్లకు భయపడేది లేదు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గుండాలకు భయపడేది లేదు అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కు దమ్ముంటే ఎదురుగా రావాలని, పిరికిపంద చర్యలు చేయవద్దని హెచ్చరించారు. నాకు రాజకీయ వారసులు లేరని, తాను గెలిస్తే కార్యకర్తలే తన వారసులు అవుతారని, తాను పుట్టి పెరిగిన హయత్ నగర్ గడ్డకు సేవ చేయాలని ఇక్కడకు వచ్చి పోటీ చేస్తున్నానని వివరించారు. తనకు సహకరించిన జక్కరి ప్రభాకర్ రెడ్డి, మల్రెడ్డి రామిరెడ్డి, కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, జితేందర్, గజ్జి భాస్కర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో యోగేశ్వర్ రెడ్డి, గజ్జి భాస్కర్, డేరంగుల కృష్ణ, కావేరి, మల్లాపురపు శ్రీనివాస్, సాంబ మహేశ్వర్ రెడ్డి, సుజాత రెడ్డి, గుర్రం శ్రీనివాసరెడ్డి, మకుటం సదాశివుడు, లింగాల కిషోర్, బుద్ధా సత్యనారాయణ, గజ్జి శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, స్వర్ణ మాధవి, శోభారాణి, శైలజ రెడ్డి, రమేష్ నాయక్, సీతారాం, జానీ భాష పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్