ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరోసారి దాడి జరిగింది. అధికార పార్టీ కాంగ్రెస్‌కు చెందిన కొందరు కార్యకర్తలు ఆయనపై టమాటలతో దాడికి పాల్పడ్డారు.
పాడి కౌశిక్ రెడ్డిపై టమాటలతో దాడి
కరీంనగర్, ఈవార్తలు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరోసారి దాడి జరిగింది. అధికార పార్టీ కాంగ్రెస్‌కు చెందిన కొందరు కార్యకర్తలు ఆయనపై టమాటలతో దాడికి పాల్పడ్డారు. కమలాపూర్‌లో జరిగిన గ్రామ సభలో కౌశిక్ రెడ్డి పాల్గొనగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరిగింది. కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగానే ఆయనపై, బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు టమాటలు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలపై కుర్చీలు విసిరారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో భారీ సంఖ్యలో పోలీసులు గ్రామ సభ వద్దకు చేరుకున్నారు.