||బీజేపీ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి||
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ TRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కచ్చితంగా అరెస్ట్ అవుతుందని బీజేపీ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం తధ్యం అంటూ ప్రజాగోస, బీజేపీ భరోసా సమావేశంలో భాగంగా హైదరాబాద్ నిర్వహించిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు. ఈ కేసులో భాగంగానే మనీశ్ సిసోదియాను అరెస్ట్ చేశారని వివరించారు. ఇప్పుడు కవిత కూడా అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లడం ఖాయమన్నారు. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. అందులో కవిత సన్నిహితులైన బోయినపల్లి అభిషేక్, అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్చంద్రారెడ్డి, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును కూడా సీబీఐ అరెస్టు చేసింది ఇప్పుడిక కవిత వంతు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆఫ్ ఎన్నికల కోసం 150 కోట్ల ఖర్చు ఎమ్మెల్సీ కవిత చేశారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో జరుగుతున్న వరుస పరిణామాలు కవితకు ఇబ్బందికరంగానే మారుతయని వ్యాఖ్యానించారు.