జేపీ నడ్డాకు కొత్త పదవి.. ఇక నుంచి పెద్దల సభలో..

భారతీయ జనతాపార్టీ రాజ్యసభా పక్ష నేతగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం పార్టీ నియమించింది. లోక్‌సభా పక్షనేతగా పీయూష్‌ గోయల్‌ ఎన్నికయ్యారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జేపీ నడ్డాను రాజ్యసభాపక్షనేతగా బీజేపీ ఎంపిక చేసింది.

jp nadda

జేపీ నడ్డా

భారతీయ జనతాపార్టీ రాజ్యసభా పక్ష నేతగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం పార్టీ నియమించింది. లోక్‌సభా పక్షనేతగా పీయూష్‌ గోయల్‌ ఎన్నికయ్యారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జేపీ నడ్డాను రాజ్యసభాపక్షనేతగా బీజేపీ ఎంపిక చేసింది. పీయూష్‌ గోయల్‌ ముంబయి ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు గెలిచి విజయం సాధించారు. దీంతో ఆయన రాజ్యసభ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి, ఆయన స్థానంలో జేపీ నడ్డాను బీజేపీ రాజ్యసభపక్షనేతగా ఎన్నుకుంది. జేపీ నడ్డాకు కాంగ్రెస్‌ పార్టీ నేత జైరామ్‌ రమేష్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిపక్ష వాదనలకు కూడా సభలో చోటు కల్పించేలా జేపీ నడ్డా వ్యవహరించాలని ఆయన కోరారు. రాజ్యసభ పక్ష నేతగా ఎంపికైన నడ్డాకు శుభాకాంక్షలు అని, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పిన విధంగా విపక్షానికి కూడా అవకాశం కల్పించగలిగితే ప్రతిపక్ష తప్పక సహకరించలదని పేర్కొన్నారు. ఈ మేరకు జైరామ్‌ రమేష్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇదిలా, ఉంటే పీయూష్‌ గోయల్‌ రాజ్యసభ సభ్యుడిగా 2010 నుంచి కొనసాగుతూ వస్తున్నారు. రాజ్యసభాపక్ష నేతగా 2021 జూలై నుంచి 14 నుంచి ఉన్నారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో గోయల్‌ లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఆయన స్థానంలో నడ్డాకు అవకాశాన్ని బీజేపీ ఽఅధిష్టానం కల్పించింది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్