రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మాదిరిగా వ్యవహరించలేదంటూ సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మాదిరిగా వ్యవహరించలేదంటూ సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏ సీఎస్ వ్యవహరించని విధంగా జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, దిగజారిపోయారని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో సోమిరెడ్డి పోస్ట్ చేశారు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదని, చీప్ సెక్రటరీ అని పేర్కొన్నారు. జగన్‌కు గులాం గిరీ చేస్తూ జవహర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దోపిడీకి జీ హుజూర్ అంటూ దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చట్టాలను బూటు కాళ్ల కింద నలిపేయడం దుర్మార్గమని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సోమిరెడ్డి.. విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.