ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అనేక ప్రాంతాల్లో దాడులు, వైసీపీ శ్రేణుల హత్యాకాండ జరుగుతోంది. కొన్నిచోట్ల గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడులు జరుగుతున్నాయి. పోలీసులు పైన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ తరహా ఘటనలపై తీవ్ర స్థాయిలో స్పందించే జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం కనీస స్థాయిలో స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి భిన్నంగా ప్రస్తుతం ఆయన ఉన్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అనేక ప్రాంతాల్లో దాడులు, వైసీపీ శ్రేణుల హత్యాకాండ జరుగుతోంది. కొన్నిచోట్ల గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడులు జరుగుతున్నాయి. పోలీసులు పైన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ తరహా ఘటనలపై తీవ్ర స్థాయిలో స్పందించే జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం కనీస స్థాయిలో స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి భిన్నంగా ప్రస్తుతం ఆయన ఉన్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలు భిన్నమైన రీతిలో ఉంటాయి. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించే గుణం ఆయనది అని ఇప్పటి వరకు అంతా నమ్ముతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇదే విషయాన్ని బలంగా చెబుతుంటారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందా అన్న అనుమానాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం ఆయన అనేక అంశాలపై స్పందించకపోవడమేనని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న దాడులు గురించి ఆయన స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరిగిన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.. ఈ తరహా ఘటనలు జరిగిన ప్రతిసారి తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ గతంలో స్పందించారు. కానీ ఉపముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ తరహా ఘటనలో జరిగినప్పటికీ ఆయన స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందించి యువతి ఆచూకీ తెలుసుకునేలా చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన ఈ తరహా ఘటనలను పట్టించుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై పవన్ కళ్యాణ్ స్పందించకూడదు అన్న ఆదేశాలు ఉన్నాయా..? లేక ప్రస్తుత పరిస్థితుల్లో వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ మౌనాన్ని దాల్చారా.? అన్నది తెలియాల్సి ఉంది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ ఘటనలపై పవన్ కళ్యాణ్ స్పందించాల్సిందిగా పలువురు కోరుతున్నారు. జన శ్రేణుల నుంచి కూడా ఇదే విధమైన డిమాండ్ కొంతవరకు వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా, వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బిజీగా ఉండడం వల్లే ఆయన స్పందించడం సాధ్యం కాలేదన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిలో కాస్త విభిన్నత కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రతిపక్షంలో ఉండగా కనిపించిన అగ్రిసివ్ ఆటిట్యూడ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లో కనిపించడం లేదని, అధికారంలో ఉండడం వలన ఆయన హుందాగా వ్యవహరించాల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు.
రాజకీయ కక్షలే కారణం అన్న భావనతోనేనా..
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను పవన్ కళ్యాణ్ కనీసం పట్టించుకోవడం లేదు. దీనికి కారణం రాజకీయ కక్షలుగానే ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా ఈ తరహా దాడులకు పాల్పడిన నేపథ్యంలోనే వాళ్లు ప్రస్తుతం ప్రతిదాడులు చేస్తున్నారు అన్న భావన ఆయనలో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో తలదూర్చకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన దాడులు, వ్యవహరించిన తీరుతో ఇబ్బందులు పడిన వాళ్లే ఇప్పుడు ప్రతిదారులు చేస్తున్నారన్న విషయాన్ని పలువురు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే మౌనాన్ని దాల్చినట్లు తెలుస్తోంది.