||పవన్ కల్యాణ్, గద్దర్ Photo: Twitter||
ఈవార్తలు, ట్రెండింగ్ న్యూస్: పవన్ కల్యాణ్.. ఓ చెగువేరా. గద్దర్.. ఓ విప్లవ కణిక. ఈ ఇద్దరిదీ ఒకేతీరు మాట, బాట. మనసులో కల్మషం లేని జీవితాలే. ఒకరు రంగుల ప్రపంచం నుంచి వచ్చినా అన్యాయం జరిగితే తెగించి కొట్లాడాలన్న పంథా. ఇంకొకరు వాస్తవ ప్రపంచం నుంచి వచ్చి కొట్లాటకు దిగిన పంథా. ఇద్దరి ఆలోచన ఒక్కటే. ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటే. అందుకే వీరిది జన్మజన్మల బంధం. అన్నదమ్ముల కన్నా ఎక్కువే. అందుకే గద్దర్ కూడా అనేవారు.. పవన్ కల్యాణ్ నాకు తమ్ముడి కంటే ఎక్కువ అని. అనారోగ్యంతో గద్దర్ మరణించటంతో పవన్ కల్యాణ్ తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. గద్దర్ చనిపోయారని తెలిసిన వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్న జనసేనాని, ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబాన్ని పరామర్శించారు.
హాస్పిటల్‌లో ఉండగా వాయిస్ మెసేజ్ పంపి.. మళ్లీ తిరిగి వస్తానని చెప్పారని.. కానీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని పవన్ కల్యాణ్ తెలిపారు. చిన్నప్పటి నుంచే తనకు గద్దర్ స్ఫూర్తి అని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గద్దర్‌పై ఓ కావ్యం చెప్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. గుండెకు గొంతు వస్తే.. బాధకు భాష వస్తే.. గద్దర్. అన్నిటికి మించి నా అన్న.. గద్దర్ అని భావోద్వేగపూరిత వీడియోను పవన్ తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేశారు.
అటు.. గద్దర్ కూడా పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ తనకు తమ్ముడి కంటే ఎక్కువ అని చెప్పేవారు. పవన్ అంటే తనకు ఇష్టమని, తమ్ముడి కంటే ఎక్కువ అని అనేవారు. తన ఇంటికి వెళ్తే పవన్ జేబులో ఎన్ని డబ్బులు ఉంటే అన్నీ తీసుకొంటానని చెప్పారు. తనకు కష్టాలు వస్తే పవన్ కల్యాణ్ ఆదుకొన్నారని చాలా సందర్భాల్లో అన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూస్తూ నిజంగా వీరి బంధం జన్మజన్మల బంధం అని కామెంట్లు చేస్తున్నారు. అన్నదమ్ముల కన్నా తక్కవ కాదని పేర్కొంటున్నారు.