వైసీపీలో జమిలి ఆశలు.. అగ్ర నేతలు నోటి వెంట వరుసగా అదే మాట

ఏపీలోని ఒక పార్టీ మాత్రం జమిలి ఎన్నికలను బిజెపి కంటే బలంగా కోరుకుంటుంది. అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఈ పార్టీ పరాభవాన్ని దక్కించుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసిపి.. ఐదేళ్లలోనే అత్యంత దారుణమైన స్థితికి దిగజారిపోయింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఆ పార్టీ పడిపోయింది. కూటమిగా బరిలోకి దిగిన టిడిపి, జనసేన, బిజెపి 164 స్థానాలను దక్కించుకున్నాయి.

YS Jaganmohan Reddy

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో బిజెపి కేంద్ర నాయకత్వం ఉంది. ఆ దిశగానే అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది బిజెపి. జెమినీ ఎన్నికల నిర్వహించాలన్న బిజెపి ఆకాంక్షలను మిగిలిన పార్టీలు ఆ స్థాయిలో వ్యక్తం చేయడం లేదు. కానీ, ఏపీలోని ఒక పార్టీ మాత్రం జమిలి ఎన్నికలను బిజెపి కంటే బలంగా కోరుకుంటుంది. అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఈ పార్టీ పరాభవాన్ని దక్కించుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసిపి.. ఐదేళ్లలోనే అత్యంత దారుణమైన స్థితికి దిగజారిపోయింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఆ పార్టీ పడిపోయింది. కూటమిగా బరిలోకి దిగిన టిడిపి, జనసేన, బిజెపి 164 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసిపి భవిష్యత్తుపై నీలి నీడల కమ్ముకున్నట్టు అయింది. ఐదేళ్లపాటు ఎన్నికల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఆ పార్టీ నేతలకు ఎదురైంది. అప్పటివరకు ఉండే వాడెవడో, పోయే వాడెవడో అన్నట్టుగా తయారైంది ఆ పార్టీలోని నేతల పరిస్థితి. ఇప్పటికే ఎంతోమంది పార్టీని వీడి కూటమి పార్టీలో చేరుతున్నారు. కొంతమంది నేతలు కేసులను ఎదుర్కోలేక బయటకు రాలేకపోతున్నారు. మరి కొంతమంది వచ్చిన ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఐదేళ్లపాటు పార్టీని నడపడం వైసిపికి కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది.

ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ జమిలి ఆలోచన వైసిపికి ఆశలను చిగురింపజేస్తోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి అంటూ ఆ పార్టీకి చెందిన అగ్ర నాయకులు పార్టీ క్యాడర్ కు చెబుతూ భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేయగా.. తాజాగా విజయసాయిరెడ్డి కూడా అటువంటి వ్యాఖ్యలనే చేశారు. జమిలి ఎన్నికలు రావడం తధ్యమని, వచ్చే ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించడం ఖాయమంటూ ఆయన క్యాడర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం చర్చనీయాంసంగా మారాయి. జమిలి ఎన్నికలు జరిగే అవకాశంపై ప్రస్తుతం చర్చకు కారణమయ్యాయి.  జమిలి ఎన్నికలు జరిగితే వైసిపి మళ్లీ అధికారంలోకి అద్భుతమైన విజయం సాధించి వస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విధమైన ఆలోచనలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులంతా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదో జరిగిందని, కానీ ఈసారి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఐదు నెలల్లోనే పెరిగిపోయిందని, కాబట్టి మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం తద్యమంటూ ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వైసీపీ నాయకుల పరిస్థితి చూస్తుంటే జమిలి ఎన్నికలను బిజెపి కంటే వైసీపీ నే ఎక్కువగా కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరి వైసిపి పెట్టుకున్న జమిలి ఆశలు నెరవేరుతాయా.? లేదా.? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్