వినుకొండలో నాలుగు రోజులు కిందట హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు, సాగిస్తున్న ఆటవిక పాలనపై ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ధర్నా చేసి దేశానికి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు తెలియజేసేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అప్రజాస్వామిక పాలన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేశారు.
రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న వైఎస్ జగన్
వినుకొండలో నాలుగు రోజులు కిందట హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు, సాగిస్తున్న ఆటవిక పాలనపై ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ధర్నా చేసి దేశానికి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు తెలియజేసేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అప్రజాస్వామిక పాలన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ దాడులపై ప్రధాని నరేంద్రమోదీని కూడా కలవనున్నట్టు ఆయన వివరించారు. వినుకొండలో నాలుగు రోజుల కిందట హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. రషీద్ తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గడిచిన నెలన్న రోజులు నుంచి రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందంటూ విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపుతప్పిందన్నారు. దారుణంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయన్నారు.
దీనికి నిదర్శనం రషీద్ కేసేనన్నారు. అత్యంత దారుణంగా ప్రజలంతా చూస్తుండగా అమాయకుడైన వ్యక్తిని చంపేశాడన్నారు. వైసీపీ సానుభూతిపరులను ఇలా నరుకుతామన్నట్టుగా సంకేతానుల పంపించడం దారుణమన్నారు. ఘటన జరిగిన గంటలోనే ఎస్సీ బయటకు వచ్చి వ్యక్తిగత గొడవలు వల్ల చంపుకున్నారని తప్పుడు మాటలు చెబుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ తరహా దాడులకు తెగబడడం దేనికి సంతకేతమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఖండించడంతోపాటు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిష్పక్షతపాతంగా ఈ తరహా ఘటనలపై వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లా అండ్ ఆర్డర్ అద్వానంగా తయారైందన్నారు. అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. 45 రోజుల్లోనే 36 రాజకీయ హత్యలు జరిగాయని విమర్శించారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. వీటితోపాటు మరో వేయికిపైగా దాడులు జరిగాయన్నారు. ఏపీలో పరిస్థితులపై ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.